బసవేశ్వరుడు సమాజానికే ఆదర్శం: మాజీ MLA

బసవేశ్వరుడు సమాజానికే ఆదర్శం: మాజీ MLA

VKB: వికారాబాద్ పట్టణంలోని MRP చౌరస్తా వద్ద సోమవారం బసవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ బసవేశ్వరుని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బసవేశ్వరుడు సామాజిక చైతన్యాన్ని పెంపొందించిన గొప్ప సంస్కర్త అని, ఆయన బోధనలతో సమసమాజ స్థాపనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.