భూటాన్‌లో ప్రారంభమైన ప్రపంచ శాంతి ప్రార్థనలు

భూటాన్‌లో ప్రారంభమైన ప్రపంచ శాంతి ప్రార్థనలు

భూటాన్ రాజధాని థింపూలో ప్రపంచ శాంతి ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి ఈనెల 17 వరకు 13 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి.  ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ నేతలు, భిక్షువులు, శాంతి దూతలు ఈ ఆధ్యాత్మిక సమ్మేళనంలో పాల్గొంటున్నారు. శాంతియుత భవిష్యత్తు కోసం ప్రేమ, కరుణ గురించి అవగాహన కల్పించడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.