'తప్పిపోయిన పిల్లల ఆచూకీ కోసం చర్యలు చేపట్టాలి'

'తప్పిపోయిన పిల్లల ఆచూకీ కోసం చర్యలు చేపట్టాలి'

పార్వతీపురం: తప్పిపోయిన పిల్లల ఆచూకీ కోసం చర్యలు చేపట్టాలని రెండవ అదనపు జిల్లా జడ్జి ఎస్ దామోదరరావు అన్నారు. పార్వతీపురం మండల న్యాయ సేవా కమిటి ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణంలో పోలీసు అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తప్పిపోయిన, ఆచూకీ తెలియని పిల్లలు, మహిళలపై ప్రత్యేక దృష్టి సారించి విచారణ పక్కాగా చేయాలని అన్నారు.