ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

MNCL: జన్నారంలో చిన్నారుల సంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పంద్రాగస్టును పురస్కరించుకొని జన్నారంలో పలు పాఠశాలల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్క పల్లిగూడా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కోలాటం, తదితర నృత్యాలను ప్రదర్శించారు. కిష్టాపూర్, బాదంపల్లి, కలమడుగు పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రదర్శించారు.