IPL 2025: కమ్మిన్స్ రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే

ఉప్పల్ వేదికగా DCతో జరుగుతున్న మ్యాచ్‌లో SRH కెప్టెన్ కమిన్స్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. నాలుగు ఓవర్లలో 19 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. IPLలో ఒక ఇన్నింగ్స్ పరవ్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఒక ఇన్నింగ్స్ పవర్ ప్లేలో ఏ కెప్టెన్ కూడా మూడు వికెట్లు సాధించలేదు.