రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి వద్ద డెడ్ బాడీ
TPT: గూడూరు రైల్వే జంక్షన్ దక్షిణ వైపున ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి వద్ద పోలీసులు గుర్తు తెలియని మృతదేహాన్ని శనివారం కనుగొన్నారు. రెండో పట్టణ సీఐ శ్రీనివాస్ మృతదేహాన్ని పరిశీలించారు. యాచకుడు అయి ఉండొచ్చని, తెల్లటి గడ్డం కలిగి ఉన్నట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. బంధువులు ఎవరైనా ఉంటే సమాచారం అందించాలన్నారు.