నెల్లూరులో ఇద్దరు యువకుల మృతి

NLR: నెల్లూరులో విషాద ఘటన వెలుగు చూసింది. గూడూరు మండలం చెన్నూరుకు చెందిన ఆర్షద్ (19), పోలయ్య (24) పినాకిని రైల్లో విజయవాడకు శనివారం బయల్దేరారు. మధ్యలో ఇద్దరూ డోర్ దగ్గరకు వచ్చి కూర్చున్నారు. నెల్లూరు, వేదాయపాలెం రైల్వే స్టేషన్‌ల మధ్య కొండాయపాలెం గేట్ వద్ద ఇద్దరూ జారి కిందపడిపోయారు. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయారు.