నీట మునిగిన ప్రాంతాల్లో ఎమ్మెల్యే ప‌ర్య‌ట‌న‌

నీట మునిగిన ప్రాంతాల్లో ఎమ్మెల్యే ప‌ర్య‌ట‌న‌

VSP: మోంథా తుఫానుతో నీట మునిగిన మల్కాపురం ఏకేసీ కాలనీ ప్ర‌భుత్వవిప్‌, విశాఖ ప‌శ్చిమ ఎమ్మెల్యే గ‌ణ‌బాబు మంగ‌ళ‌వారం ప‌ర్య‌టించారు. మోకాళ్లలోతు నీటిలో దిగి మ‌రీ.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. త‌క్ష‌ణం ఇళ్ల‌ల్లోకి చేరిన నీటిని బ‌య‌ట‌కు వెళ్లేలా చర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న జీవీఎంసీ, రెవెన్యూ అధికారుల‌ను ఆదేశించారు.