బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దీక్షా విజయ్ దివస్
MNCL: జిల్లా కేంద్రంలో మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దీక్షా విజయ్ దివస్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ స్వరాష్ట్రం కోసం 11 రోజులు ఆమరణ దీక్ష చేపట్టి ఢిల్లీ మెడలు వంచిన రోజు డిసెంబర్ 9 అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల సాకారానికి ఈ రోజే తొలి అడుగు పడిందన్నారు.