VIDEO: గిరిజనులను మోసం చేసే యత్నం మాజీ ఎమ్మెల్యే
WGL: వర్ధన్నపేట పట్టణంలో సోమవారం జరిగిన ప్రెస్‌మీట్‌లో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మాట్లాడుతూ.. గిరిజనులను మోసం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. మున్సిపాలిటీ నుంచి గిరిజన తండాలను వేరు చేస్తామని కాంగ్రెస్ అబద్ధపు హామీలు ఇస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఓట్లు దండుకోవాలని ఎమ్మెల్యే నాగరాజు ప్రయత్నిస్తున్నారని ఆయన ఖండించారు.