250 మంది పోలీసులతో తనిఖీలు
SS: సత్యసాయిబాబా శతజయంతి వేడుకల భద్రత నేపథ్యంలో పుట్టపర్తిలో శుక్రవారం ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. 250 మంది పోలీసు సిబ్బందితో కర్ణాటకనాగేపల్లి, పెద్ద బజార్ సహా ఐదు కాలనీల్లో ఇంటింటా తనిఖీలు చేపట్టారు. నంబర్ ప్లేట్ లేని 50 వాహనాలను సీజ్ చేసి, రౌడీ షీటర్లకు హెచ్చరికలు జారీ చేశారు.