శేష వాహనంపై కొలువుదీరిన జ్వాలా నరసింహస్వామి

శేష వాహనంపై కొలువుదీరిన జ్వాలా నరసింహస్వామి

NDL: ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రం అహోబిలంలో వైశాఖ మాస నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఎగువ అహోబిలంలో ఇవాళ శ్రీదేవి, భూదేవి సమేతంగా జ్వాలా నరసింహస్వామి శేష వాహనంపై కొలువుదీరి తిరువీధుల్లో విహరించారు. మధ్యాహ్నం స్వామి అమ్మ వారిని పంచామృతాలతో అభిషేకించారు. రాత్రి స్వామి చంద్రప్రభవాహనంపై దర్శనం ఇవ్వనున్నారు.