చేతులపై మోస్తూ.. గర్భిణీని వాగు దాటించారు..!

చేతులపై మోస్తూ.. గర్భిణీని వాగు దాటించారు..!

ములుగు: చేతులపై మోస్తూ ఓ గర్భిణీని వాగు దాటించిన ఘటన తాడ్వాయి మండలం బందాల గ్రామ పంచాయితీ పరిధిలో జరిగింది. అల్లిగుడెం గ్రామానికి చెందిన నిండు గర్భిణి కృష్ణవేణికి పురిటి నొప్పులు వచ్చాయి. ఈ క్రమంలో ట్రాక్టర్ సహాయంతో అతికష్టం మీద సమీపంలోని వట్టివాగు వరకు చేరుకున్నారు. వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో గ్రామస్తులు భుజాలపై గర్భిణిని మోసి ఆసుపత్రికి తరలించారు.