కోతుల దాడిలో వృద్ధురాలు మృతి

కోతుల దాడిలో వృద్ధురాలు మృతి

AP: రాష్ట్రంలో కోతుల బెడద తీవ్రరూపం దాల్చుతోంది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు(M), పెద్దిపాలెంలో దానబోయిన చిన్నబుల్లి (68) అనే వృద్ధురాలు కోతుల మూకదాడిలో ప్రాణాలు కోల్పోయారు. గేదెకు నీరు పెట్టే క్రమంలో 20కి పైగా కోతులు ఒక్కసారిగా ఆమెపై పడి దాడి చేశాయి. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఇలాంటి ఘటనలు జరగకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.