మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి
ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్య చంద్రరావు ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్య్ర సమరంలో మహాత్మా గాంధీ గారి ఆదర్శాలకు అనుగుణంగా నడుచుకుంటూ, దేశ స్వాతంత్య్రం కోసం అవిశ్రాంతంగా కృషి చేశారని అన్నారు.