రామయ్య సన్నిధికి రూ.12 లక్షల విరాళం
BDK: భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం నిర్మించనున్న జానకి సదనం గది కోసం ఖమ్మం జిల్లా, జయనగర్ కాలనీకి చెందిన భక్తుడు రంగం వకుళ భాష్యం రూ.12 లక్షల భారీ విరాళాన్ని అందించారు. ఈ విరాళాన్ని సోమవారం భక్తుడు స్వయంగా ఆలయ ఈవో దామోదర్‌కు అందజేశారు. భక్తుల సహకారంతోనే ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా సాగుతున్నాయని ఈవో తెలిపారు.