'పేదలను ఆర్థికంగా పైకి తీసుకురావడానికి పీ–4'

కృష్ణా: CM చంద్రబాబు పేదలను ఆర్థికంగా పైకి తీసుకురావడానికి పీ–4 పథకం అమలు చేస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ తెలిపారు. శనివారం ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో భాగంగా ఆయన మాచవరంలో పథకాల వివరాలు చెప్పి, ఇద్దరు నిరుపేదలకు ఇస్త్రీ, టిఫిన్ బండులు అందించారు. పీ–4 పథకంతో పేదరిక నిర్మూలన సాధ్యమని చెప్పారు.