VIDEO: నర్సింహుల గూడెంలో శివ శంకర్ విజయం
HNK: ఐనవోలు మండలం నర్సింహుల గూడెం గ్రామంలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఆదివారం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి పోలేపల్లి శివ శంకర్ రెడ్డి 127ఓట్ల మెజార్టీ తో విజయం సాధించారు. క్షేత్రస్థాయి ప్రచారం, పార్టీ శ్రేణుల సమన్వయంతో ఆయనకు గ్రామ ప్రజలు మద్దతు తెలిపారు. ఈ గెలుపుతో గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.