అలుగు పారిన మహబూబ్‌సాగర్ చెరువు

SRD: సంగారెడ్డి పట్టణంలోని మహబూబ్‌సాగర్ చెరువు అలుగు ఆదివారం పారుతుంది. నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో చెరువు నుండి అలుగు పారింది. అలుగు పారే దృశ్యాన్ని చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో చెరువు వద్దకు తరలివచ్చారు. చెరువు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో ఎవరు కూడా అటువైపు వెళ్ళవద్దని పట్టణ సీఏ రమేష్ తెలిపారు.