చెక్‌పోస్ట్ వద్ద కర్ణాటక మద్యం స్వాధీనం
KRNL: ఇవాళ ఎమ్మిగనూరు మండలం కడివెల్ల గ్రామానికి చెందిన మల్లమ్మ అనే మహిళ, సాగునూరు జాతరలో విక్రయించేందుకు అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం (48 ఓసీ టెట్రా ప్యాకెట్లు) మంత్రాలయం నియోజకవర్గం మాధవరం చెక్‌పోస్ట్ వద్ద పోలీసులకు పట్టుబడింది. సీఐ ప్రసాదరావు నేతృత్వంలో జరిగిన ఈ తనిఖీల్లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.