VIDEO: మినీ ట్యాంక్ బండ్‌పై నాగు పాము కలకలం

NGKL: జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ ఫుట్ పాత్ పక్కన నాగుపాము శుక్రవారం కనిపించడంతో వాకింగ్ చేస్తున్న ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. స్నేక్ క్యాచర్ వంశీకి సమాచారం ఇవ్వగా, అతను ఆ పామును పట్టుకుని నిర్మానుష్య ప్రదేశంలో విడిచిపెట్టారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కలుపు మొక్కలు పెరిగి పాములు అటుగా సంచరిస్తున్నాయని వంశీ తెలిపారు.