VIDEO: పువ్వు దులిపే దశకు చేరుకున్న సీడ్ వరి పంట
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రికార్డు స్థాయిలో సాగు చేసిన సీడ్ వరి పంట ప్రస్తుతం పువ్వు దులిపే దశకు చేరుకుంది. 'ఆడ-మగ' వరి పువ్వులు కలిసేలా చేసే ఈ ప్రక్రియకు కూలీల కొరత వేధిస్తోంది. కేవలం రెండు గంటల పనికే కూలీలకు రూ. 250 నుంచి 300 వరకు పలుకుతుంది. కూలీల డిమాండ్ పెరగడంతో గ్రామాల్లో సందడి నెలకొంది.