పోలీసులకు మానసిక స్థైర్యం అవసరం: ఎస్పీ
CTR: పోలీసు వృత్తి బాధ్యతాయుతమైనదే కాకుండా ప్రజలకు సేవ చేసే పవిత్ర అవకాశమని ఎస్పీ తుషార్ తెలిపారు. చిత్తూరులో SCTPC అభ్యర్థులకు పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో మొదటి సెమిస్టర్‌లో జరుగుతున్న చివరి పరీక్షను గురువారం ఆయన పరిశీలించారు. శిక్షణలో వారు ఎదుర్కొన్న అనుభవాలను ఆరా తీశారు. శారీరిక దృఢత్వం, మానసిక స్థైర్యం పోలీసు వృత్తికి ఎంతో అవసరమన్నారు.