జగ్జీవన్ రామ్‌కు నివాళులర్పించిన నాయకులు
MNCL: బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు కృషి చేయాలని వివిధ సంఘాల నాయకులు కోరారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని ఆదివారం జన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పనిచేసిన మహనీయుడు డాక్టర్ జగ్జీవన్ రామ్ అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.