రైల్వే స్టేషన్లో పార్కింగ్ దోపిడీ
NTR: విజయవాడ రైల్వే స్టేషన్లో పార్కింగ్ ఫీజులు, ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. రైల్వే స్టేషన్‌లో టూ, ఫోర్ వీలర్లు పార్కింగ్ చేయాలంటే వాహనదారులు భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. టూ వీలర్కు గంటకు రూ.12 చార్జీ వసూలు చేస్తున్నారు. 12 గంటలకు 144 రూపాయల పార్కింగ్ ఫీజు తీసుకుంటున్నారు. 24 గంటలకు 288 రూపాయల చార్జీ అని చెబుతున్నారు.