లాడ్జిలో వ్యభిచార ముఠా గుట్టురట్టు
GDWL: ఉండవెల్లి మండల కేంద్రంలోని గీతా లాడ్జిలో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ముగ్గురు విటులు , ఒక మహిళతో పాటు, లాడ్జీ యాజమానిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన విటులు ఇటిక్యాల మండలానికి చెందినవారుగా గుర్తించారు. నలుగురితో పాటు లాడ్జి యాజమానిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.