జోగులాంబ ఆలయ ఈవోగా దీప్తి

జోగులాంబ ఆలయ ఈవోగా దీప్తి

GDWL: అలంపూర్‌లోని శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వాహణాధికారి(ఈవో)గా దీప్తి అదనపు బాధ్యతలు శుక్రవారం చేపట్టారు. దేవాదాయ శాఖ నిబంధనల ఉల్లంఘన, పలు ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుత ఈవో పురేంద్ర కుమార్ బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో దీప్తి ఈవోగా బాధ్యతలు స్వీకరించారు.