VIDEO: చెరువులో మునిగిన బాలుడు మృతి
అన్నమయ్య: గాలివీడు మండలం కుమ్మరపల్లికి చెందిన కొత్తకోట సుధాకర్ కుమారుడు రోహిత్ (14) చెరువులో గల్లంతయిన విషయం తెలిసిందే. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన సమయంలో అకస్మాత్తుగా గల్లంతైన అతడిని ఫైర్ సిబ్బంది గాలించి మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.