విశాఖ కోర్టు నుంచి ఖైదీ పరారీ

విశాఖ కోర్టు నుంచి ఖైదీ పరారీ

విశాఖపట్నం కోర్టుకు హాజరవుతుండగా పోలీస్ కస్టడీ నుంచి పూడి వంశీ అనే 20 ఏళ్ల యువకుడు తప్పించుకున్నాడు. టీఐసీ జంక్షన్, అరిలోవకు చెందిన వంశీ తండ్రి పేరు కాశీగా తెలిపారు. ఈ విషయంపై టూ టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వంశీ ఆచూకీ తెలిసినవారు వెంటనే టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సీఐ, ఎస్సైలు శనివారం కోరారు.