బాబుపేట శివారు రైల్వే గేటు మూసివేత

HNK: ఎల్కతుర్తి మండలం బావుపేట్ శివారు రైల్వే గేట్ మరమ్మతుల కారణంగా మే 7వ తేదీ వరకు మూసివేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కమలాపూర్ నుంచి హన్మకొండ, ఎల్కతుర్తి నుంచి కమలాపూర్‌కు వెళ్లే వాహనదారులు సీతంపేట్ మీదుగా వెళ్లాలని అధికారులు సూచించారు. ఉప్పల్ నుంచి ఎల్లాపూర్ వరకు మరమ్మతులతో పాటు కొత్త పనులు జరుగుతున్నాయని వాహనదారులు గమనించాలని కోరారు.