కడపలో గంజాయి అసాంఘిక శక్తులపై డ్రోన్ నిఘా
కడప నగరంలో గంజాయి, అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎస్పీ షెల్కే నచికేత్ ఆదేశాలతో డీఎస్పీ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో మంగళవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. తారకరామా నగర్, రవీంద్రనగర్ తదితర ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టి జల్లెడ పట్టారు. గంజాయి, బహిరంగ మద్యపానం చేసేవారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు.