రోడ్డు ఆక్రమణలపై జగ్గంపేట పోలీసుల హెచ్చరిక
KKD: జగ్గంపేట కాకినాడ-గోకవరం ప్రధాన రోడ్డుపై అక్రమ పార్కింగ్‌పై ఎస్సై రఘునాథరావు సోమవారం కఠిన హెచ్చరిక జారీ చేశారు. దుకాణాలకు వచ్చే వారు బైకులను రోడ్డుకు దిగువ భాగంలో పార్క్ చేయాలని, తోపుడుబండ్ల వర్తకులు ఆర్టీసీ బస్సుల రాకపోకలకు అడ్డులేకుండా వ్యాపారం సాగించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.