డయేరియా బాధపడుతున్న వారిని గుర్తించాలి. ఇన్‌ఛార్జ్ కలెక్టర్

VZM: డయేరియా బాధపడుతున్న వారిని గుర్తించి తక్షణమే వైద్య సేవలు అందించాలని.. 5 సంవత్సరాల లోపు పిల్లల్లో డయేరియా మరణాలు సంభవించకుండా చూడాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్ శుక్రవారం తెలిపారు. స్టాప్ డయేరియా పేరుతో జూన్ 1 నుంచి జిల్లాలో పలు అవగాహన కార్యక్రమంలో నిర్వహిస్తున్నారు. ఈనెల 31తో ఈ కార్యక్రమం ముగియనుందని అన్నారు. ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ పాల్గొన్నారు.