172 మందికి 'అమృత హెల్త్ స్కీమ్' కార్డులు
సత్యసాయి: పుట్టపర్తి కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ అమృత హెల్త్ స్కీమ్ కార్డులను పంపిణీ చేశారు. ఓల్డ్ ఏజ్ హోమ్స్‌లోని 117 మంది వృద్ధులు, అనాథ శరణాలయాల్లోని 55 మందికి (మొత్తం 172 మందికి) ఆయన కార్డులను అందజేశారు. ఈ కార్డుల ద్వారా లబ్ధిదారులు ఏటా రూ. 25 లక్షల వరకు ఉచితంగా, నగదు రహితంగా వైద్య సేవలు పొందవచ్చని కలెక్టర్ తెలిపారు.