చినఉప్పలంలో సమగ్ర ఐఈసీ ప్రచార కార్యక్రమం

AKP: ఎస్.రాయవరం మండలం చినఉప్పలంలో బుధవారం చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీమ్ ఆధ్వర్యంలో సమగ్ర ఐఈసీ ప్రచార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు ముందుగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. లింక్ వర్కర్ షేక్ నసీమా సుఖవ్యాధులు, హెచ్ఐవీ, ఎయిడ్స్, టీబీపై వివరించారు.