ఉపన్యాస, పాటల పోటీలను ప్రారంభించిన DEO

ఉపన్యాస, పాటల పోటీలను ప్రారంభించిన DEO

BHNG: 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా సోమవారం భువనగిరిలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించిన ఉపన్యాసం, పాటల పోటీలను DEO సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు పఠనం ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుందన్నారు. తరగతి గదిలో పుస్తకాలకే పరిమితం కాకుండా ఇతర గ్రంథాలు చదవడం ద్వారా లోకజ్ఞానాన్ని పెంచుకోవాలని సూచించారు.