మోత్కూర్‌లో సీపీఎం రాజకీయ శిక్షణాతరగతులు

యాదాద్రి: ఈనెల 18, 19 తేదీలలో మోత్కూర్లో జరిగే సీపీఎం ప్రాంతీయ రాజకీయ శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని సీపీఎం మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు పిలుపునిచ్చారు. రాగిబావి గ్రామంలో జరిగిన పార్టీ గ్రామ శాఖ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆత్మకూర్, గుండాల, అడ్డగూడూర్ మండలాల పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై తరగతులను విజయవంతం చేయాలని కోరారు.