48 గంటల పాటు నీటి సరఫరా బంద్

HYD: మహానగరానికి తాగునీరు సరఫరా చేస్తున్న గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-1 పథకంలో భాగంగా మెయిన్ వాల్వ్‌ల మార్పిడి పనుల నేపథ్యంలో 48 గంటలు నీటి సరఫరా అంతరాయం ఉంటుందని జలమండలి అధికారులు తెలిపారు. SRనగర్, సనత్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ, బంజారాహిల్స్, సోమాజిగూడ, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో 9న ఉదయం 6 గంటల నుంచి 48 గంటల పాటు అంతరాయం ఉంటుందన్నారు.