ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలి: సీపీఐ

KMM: కారేపల్లి మండలంలో గురువారం సాయంత్రం సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో పలు సమస్యలపై భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ నాయకులు భూక్య శివ నాయక్ మాట్లాడుతూ.. రెండు లక్షల పైచిలుకు ఉన్న రైతుల రుణమాఫీని ఏలాంటి ఆంక్షలు లేకుండా తక్షణమే మాఫీ చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వారు పేర్కొన్నారు.