జిల్లాలో 35లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం

KMM: వన మహోత్సవంలో భాగంగా ఈ ఏడాది ఖమ్మం జిల్లాలో 35,23,300 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఖమ్మం అటవీ శాఖ తరఫున 2,47,200, సత్తుపల్లి డివిజన్‌లో 3లక్షలు, ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 3,08,920, మధిర, సత్తుపల్లి మున్సిపాలిటీల్లో 2,41,740 కల్లూరులో 65వేలు, వైరాలో 50వేలు, ఏదులాపురంలో 40వేల మొక్కలు నాటాల్సి ఉంటుంది. మిగతా శాఖలకు కేటాయించారని తెలిపారు.