పేదవాడి రిఫ్రిజిరేటర్'కు ఫుల్ డిమాండ్
NLG: ఉమ్మడి నల్గొండ జిల్లాలో వేసవి ఎండలు మండిపోతుండడంతో మట్టి కుండలకు భారీగా డిమాండ్ పెరిగింది. చల్లటి నీరు కోసం పేదవారు కుండలనే ఆధారంగా ఉపయోగిస్తున్నారు. తక్కువ ఖర్చుతో సహజంగా నీరు చల్లగా ఉంచే వీటిని 'పేదవాడి రిఫ్రిజిరేటర్'గా భావిస్తున్నారు. చిన్న కుండల ధరలు రూ.100 నుంచి ప్రారంభమవుతుండగా,పెద్ద కుండలు రూ.200 వరకు పలుకుతోంది.