ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

W.G.పెనుగొండ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. డెలివరీలు ఎన్ని జరుగుతున్నాయి, సర్జరీలు చేస్తున్నారా, ఎక్స్‌-రేలు తీస్తున్నారా, యాంటీబయోటిక్ మందులు ఉన్నాయా, స్పెషలిస్ట్ వైద్యులు ఎవరున్నారు అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.