వీరబల్లిలో రేపు మండల సర్వసభ్య సమావేశం

వీరబల్లిలో రేపు మండల సర్వసభ్య సమావేశం

అన్నమయ్య: వీరబల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం రేపు బుధవారం ఉదయం 10:30 గంటలకు మండల పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించబడుతుందని ఎంపీడీవో జోహర్ బాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, పాత్రికేయులు తప్పనిసరిగా హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.