చెరువులో దిగి చేపలు పట్టిన రాహుల్ గాంధీ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బెగురాయ్ ప్రాంతంలోని జాలర్లతో కాసేపు సరదాగా ముచ్చటించారు. అనంతరం జాలర్లతో కలిసి చెరువులోకి దిగి సందడి చేశారు. వారితో కలిసి చెరువులో చేపలు పడుతూ ముచ్చటించారు. తర్వాత వారితో ఫొటోలు దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.