రైల్వే భూముల పరిరక్షణకు చర్యలు
AKP: నక్కపల్లి మండలం గుల్లిపాడు రైల్వే స్టేషన్ పరిధిలో రైల్వే భూముల పరిరక్షణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా రైల్వే ట్రాక్‌కు ఇరువైపులా రైల్వే భూములను గుర్తించి సర్వే రాళ్లు వేస్తున్నారు. అనంతరం ఐరన్‌తో ఫెన్సింగ్ వేస్తున్నారు. గత 20 రోజుల నుంచి రైల్వే సిబ్బంది ఈ పనులను చేపడుతున్నారు.