VIDEO: క్లాత్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం
RR: బండ్లగూడలోని సిద్ధి వినాయక క్లాత్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దుకాణంలోని బట్టలన్నీ కాలి బూడిదయ్యాయి. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.