వినతులు స్వీకరించిన ఆర్డీవో

వినతులు స్వీకరించిన ఆర్డీవో

కోనసీమ: రామచంద్రపురం ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీకోసం గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆరు అర్జీలు అందినట్లు ఆర్డీవో డి.అఖిల తెలిపారు. పాసుబుక్ మంజూరి, తల్లికి వందనం, ఇంటి స్థలం మంజూరు, వీధి కుక్కల నివారణ, ఆక్రమణ తొలగింపు సమస్యలపై ఫిర్యాదు అందినట్లు పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేసి అర్జీదారులకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.