ట్రాఫిక్ నియమాలను విధిగా పాటించాలి: సీపీ
NZB: రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను విధిగా పాటించాలనిపోలీస్ కమిషనర్ సాయి చైతన్య పిలుపునిచ్చారు. ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా శాస్త్రి నగర్‌లో నిర్వహించిన గ్రామసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇతర ప్రమాదాల కంటే రహదారి ప్రమాదాల వల్లే సమాజంలో అత్యధిక ప్రాణనష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.