'కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి'

'కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి'

కరీంనగర్ వర్కింగ్ జర్నలిస్టుల స్థలాలను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు జర్నలిస్టులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మల్కాపూర్‌లోని 44, 45, 46, 50 నంబర్ గల ప్లాట్లను కొందరు కబ్జా చేసేందుకు చదును చేశారు. చదును చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.