జావేద్ మృతి పట్ల రాహుల్ గాంధీ దిగ్బ్రాంతి
ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మహమ్మద్ జావేద్ రోడ్డు ప్రమాదంలో మరణించారన్న వార్త విని చాలా బాధపడ్డానని ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ తెలిపారు. ఆయన ప్రజలకు, కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో పనిచేసిన నాయకుడని, ఆయన అంకితభావం, చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. జావేద్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.